![]() |
![]() |

బుల్లితెర మీద అమరదీప్-తేజు జోడి గురించి తెలియని వాళ్ళు లేరు. శ్రీముఖి ఐతే తమ్ముడు అంటూ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక ఒక ఇంటర్వ్యూలో ఐతే వర్ష రాఖీ కట్టి తమ్ముడు అని పిలిచింది. ఇక ఆమె కాళ్లకు దణ్ణం పెట్టుకుని బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అలాగే ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. "సింధూరం టైం నుంచి నేను ఆ సినిమా ఎప్పుడైతే చూశానో నా మైండ్ లో రన్ ఐన హీరో ఒకే ఒక్క రవితేజ. నీ పేరు ఎప్పుడు చూస్తాను అని ఎదురు చూస్తున్నానురా నా లిస్ట్ లో అంటే అవకాశం వస్తే అది నీకు ఉపయోగపడేలా ఉండాలి అన్నారు. నేను ఊహించుకున్న నా దేవుడు నా గురించి మాట్లాడినప్పుడు ఇది కదా నా సక్సెస్" అన్నాడు అమరదీప్. "తేజు నా లైఫ్ లోకి రావడం దేవుడు ఇచ్చిన వరం, అదృష్టం , అబ్బా దీంతో తలనొప్పిరా బాబు అనే ఈ మూడు ఉంటేనే అది ప్రేమ, అది పెళ్లి, అది పెళ్ళాం.

నేను ఎప్పుడూ ఏ విషయాన్నీ క్యారీ ఫార్వర్డ్ చేయను. నా మెంటల్ స్టేటస్ నాట్ గుడ్. నేను ఒక ఓవర్ థింకర్ ని . అది నాకు తెలీదు. నా థింకింగ్ కి అసలు కంట్రోల్ ఉండరు. కర్మ కచ్చితంగా హిట్ అవుతుంది. నేను ఒకప్పుడు వాళ్ళను బాధపెట్టాను కాబట్టి ఇప్పుడు నేను కర్మను తిరిగి అనుభవిస్తున్నాను. నా షర్ట్ విప్పి చూస్తే వీపు మొత్తం వెన్నుపోట్లే ఉంటాయి జీవితమంతా. చెప్పులు ఎప్పుడూ బయటే ఉండాలి. బెడ్ రూమ్ వరకు రాకూడదు..అన్నా చెల్లి అనే బంధానికి ఒక స్వచ్ఛత ఉంది అది పాడు చేయకూడదు. మా అమ్మ లేకపోతే అమర్ అనే బొమ్మే లేదు మీముందు.. కొంత మంది లవ్ చేసి సూసైడ్ చేసుకుంటున్నారు.. అలాంటి వాళ్ళకోసం నువ్వు ఏం చెబుతావ్ అని వర్ష అడగడంతో... సూసైడ్ చేసుకోవాలంటే ధైర్యం కావాలి.." అంటూ చెప్పుకొచ్చాడు అమరదీప్.
![]() |
![]() |